వాజ్‌పేయీ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల.!

SMTV Desk 2018-12-24 15:55:46  Atal Bihari Vajpayee, Coin, Narendra Modi

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: 2018 ఆగస్ట్‌లో మరణించిన మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి 94వ జయంతి సందర్భంగా, గౌరవార్ధం ఆయన చిత్రంతో రూపొందిన రూ.100 నాణేన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేశారు. అటల్‌ బిహారి వాజ్‌పేయి జయంతోత్సవానికి వొక రోజు ముందుగా ఈ నాణేలను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో భాజపా అగ్రనేత, వాజ్‌పేయీ సన్నిహితుడు ఎల్‌కే అడ్వాణీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తదితరులు పాల్గొన్నారు.

వాజ్‌పేయి ఈ ఏడాది ఆగస్ట్‌ 16న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వాజ్‌పేయి 1998-2004లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. వాజ్‌పేయి 1996లో కొంత కాలం, 1998-2004 మధ్య రెండు సార్లు దేశ ప్రధాని బాధ్యతలు నిర్వర్తించారు.