పోలవరాన్ని వైసిపీ నేతలు అడ్డుకుంటున్నారు : పత్తిపాటి పుల్లారావు

SMTV Desk 2018-12-24 15:52:03  AP, TDP, YSRCP, Jaganmohan reddy, Pattipaati pullarao

గుంటూరు, డిసెంబర్ 24: తెదేప మంత్రి పత్తిపాటి పుల్లారావు వైఎస్‌ఆర్‌సిపి నేతలపై మండిపడ్డారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అభివృద్ధిని, పోలవరాన్ని వైఎస్‌ఆర్‌సిపి నేతలు అడ్డుకుంటున్నారని అంతేకాకుండా రాజధానికి నిధులు ఎందుకివ్వరని వైఎస్‌ఆర్‌సిపి నేతలు కేంద్రాన్ని ఎప్పుడైనా నిలదీశారా? అని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు టిడిపివేనన్నారు. దేశంలో ఎక్కువ పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపినే అని అన్నారు. పొత్తులపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఇప్పుడే ఏమీ చెప్పలేమని ,తుది నిర్ణయం పార్టీ అధిష్టానందే అని ,పొత్తు పెట్టుకున్నా, లేకున్నా టిడిపి గెలుపుని ఎవరూ అడ్డుకోలేరని పుల్లారావు తెలిపారు.