సింధుకి అభినందనలు తెలిపిన వెంకయ్యనాయుడు

SMTV Desk 2018-12-24 14:38:51  PV Sindhu, Venkaiah nayudu, BWF World tour

హైదరాబాద్, డిసెంబర్ 24: ఈ రోజు ఉదయం భారత బాడ్మింటన్‌ క్రీడాకారిణి పివి సింధును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ప్రతిష్టాత్మక బిడబ్లూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ను మొదటిసారి నెగ్గిన సింధుకు వెంకయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ సింధు దేశానికి మంచి పేరు తీసుకువచ్చారని , ఈ విజయంతో ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారని ప్రశంసలు కురిపించారు. గతేడాది సింధు ఫైనల్‌కు చేరినా సిల్వర్‌ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాని ఈ సారి మాత్రం సింధు టైటిల్‌ గెలవడం విశేషం. ఈ ఏడాది మొదటి నుంచీ సింధు టాప్‌ ఫామ్‌లో ఉంది.