పశ్చిమబెంగాల్ లో ఒంటరిగానే పోటీ : రాహుల్

SMTV Desk 2018-12-24 13:03:33  Rahul Gandhi, Mamatha Banerjee, 2019 Elections

కలకత్తా, డిసెంబర్ 24: మహాకూటమిని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఆదిలోనే ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. కాంగ్రెస్ తో పొత్తును తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ లో వొంటరిగానే పోటీ చేయనున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జరగబోయే ఎన్నికల్లో వొంటరిగానే బరిలోకి దిగాలని... బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (మమత పార్టీ)లపై పోరాడాలని ఆయన తెలిపారు.

మరోవైపు, ఫిబ్రవరిలో కోల్ కతాలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి రాహుల్ హాజరయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన తేదీని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్-టీఎంసీల మధ్య మహాకూటమి కానీ, పొత్తు కానీ ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.