భారత్‌ తీరును చూసి పాకిస్తాన్ నేర్చుకోవాలంటున్న ఓవైసీ.!

SMTV Desk 2018-12-24 11:42:56  Akbaruddin Owaisi, MIM, Imran Khan, Pakistan

హైదరాబాద్‌, డిసెంబర్ 24: మోదీ ప్రభుత్వానికి మైనారిటీలతో ఎలా మెలగాలోచూపెడతామని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. మైనార్టీల రాజకీయ హక్కుల విషయంలో భారత్‌ను చూసి పాకిస్తాన్‌ చాలా నేర్చుకోవాలని హితవుపలికారు. భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు ప్రధాని అయ్యే అవకాశం ఉంటుందని, పాకిస్తాన్‌ రాజ్యాంగం ప్రకారం ముస్లిం వ్యక్తి మాత్రమే ఆ దేశానికి ప్రధాని కాగలడని అక్బరుద్దీన్ తెలిపారు.

‘‘భారత్‌లో మైనారిటీలను ఇతర పౌరులతో సమానంగా చూడడంలేదని అందరూ అంటున్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, అది తిరుగుబాటుకు దారితీస్తుంది అని ఇటీవల ఇమ్రాన్‌ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మైనార్టీల పట్ల భారతదేశం వ్యవహిరిస్తున్న తీరును చూసి మీరు నేర్చుకోవాలని ఓవైసీ పేర్కొన్నారు.