గోమాతతో క్రూరత్వంగా ప్రవర్తించిన కామందులు

SMTV Desk 2018-12-24 11:40:05  Cow rape, Rapes, Sexual harassement

తూ.గో.జి, డిసెంబర్ 24: దేశంలో కామపిశాచులు మహిళలు, చినరుల పైనే కాకుండా పవిత్రమైన గోమాతను సైతం తమ కామవాంఛలకు బలి చేశారు. వివరాల్లోకెల్తే పిఠాపురం మండలం గోకివాడకు చెందిన నామా బుచ్చిరాజు అనే రైతుకు పశువులు ఉన్నాయి. వాటిని బి.కొత్తూరు రోడ్డులోని తన పశువుల పాకలో ఉంచేవాడు.

శనివారం రాత్రి తన మూడు ఆవులు, రెండు గిత్తలు, వొక దూడను కట్టేసి ఇంటికొచ్చి పడుకున్నాడు. అయితే తెల్లవారుజామున పాక వద్దకు వెళ్లి చూడగా పశువులు కనిపించలేదు. అటు ఇటు వెతకగా తాడిచెట్టుకు కట్టేసి ఉన్న తన ఆవు వొకటి కదల్లేని స్థితిలో కనిపించింది. మూడు నెలల గర్భంతో ఉన్న ఆవు మర్మాంగం వద్ద రక్తపు గాయాలు కనిపించడంతో లైంగికదాడి జరిగినట్టు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశువైద్యాధికారి సైతం అత్యాచారం జరిగిందని నిర్థారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.