దేశంలో 2050 నాటికి తీవ్ర నీటి కొరత...!!!

SMTV Desk 2018-12-23 19:56:53  Indian national center for ocean information services, Mumbai, Kerala, Gujarat, Ganga, Krishna, Kaveri

హైదరాబాద్, డిసెంబర్ 23: ముంభై, గుజరాత్ రాష్ట్రాలతో పాటు దక్షిణ కేరళలోని కొంకణ్ ప్రాంతాల్లో నీటి మట్టం పెరిగిందని హైదరాబాద్ లోని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఐఎన్‌ఎస్‌వొఐఎస్‌) తెలిపింది. సముద్ర నీటి మట్టం 2.8 అడుగుల మేర పెరిగిందని వెల్లడించింది. కాగా సముద్ర నీటి మట్టం పెరిగితే నదుల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. ముఖ్యంగా గంగ, కృష్ణా, కావేరి, మహానది డెల్టా ప్రాంతాలు ముప్పును ఎదుర్కొంటాయి. దీని వల్ల దక్షిణ భారతదేశంలో 2050 నాటికి తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్ర నీటిమట్టం పెరిగితే భూగర్భ జలాలు ఉప్పు కయ్యలుగా మారి వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారుతుందని కేంద్ర పర్వావరణ శాఖ సహాయ మంత్రి మహేశ్‌శర్మ తెలిపారు. తీర ప్రాంత పరిరక్షణకు కేంద్రప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.