పంచాయితీ ఎన్నికలపై ఘాటుగా స్పందించిన హనుమంతరావు

SMTV Desk 2018-12-23 19:04:11  TRS, Congress party, V.Hanumanthrao, Press meeting, BC Categeory

హైదరాబాద్, డిసెంబర్ 23: కాంగ్రెస్‌ సీనియన్‌ నేత వి.హనుమంతరావు శనివారం విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణాలో అసలు ప్రతిపక్షం లేకుండా చూస్తున్నారని కెసిఆర్‌ ఎన్నికల ముందు సమగ్ర కుటుంబ సర్వే తరువాత కుల రాజకీయాల ఎలా చేస్తున్నారో బాగా అర్థం అయిందన్నారు. ఆదర బాధరగా ఎన్నికలు నిర్వహించి బిసిలకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. ఎన్నికలలో మా ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్‌ ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది అన్నారు. మనం ఎందుకు ఓడిపోవడం జరిగిందనే విషయంపై సమీక్ష చేయాలని, అప్పుడు కార్యకర్తలకు భరోసా ఇవ్వాలన్నారు. ప్రజలు మీకు పూర్తి మెజార్టీ ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇతర పార్టీల వారికి డబ్బులు, పదవుల ఆశలు చూపి పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యంను అవహేళన చేస్తున్న వ్యక్తి ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూనే ఎలా ఇతర పక్షాలు మద్దతు ఇస్తాయో ఆలోచించాలన్నారు. రేవ్‌ పార్టీల పేరుతో పాశ్యాత్య సాంస్కృతిని ప్రోత్సాహం చేస్తుంటే అసలు పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నారన్నాని ఆయన ప్రశ్నించారు.