ఒక రోజు ఛానళ్ల నిలిపివేత

SMTV Desk 2018-12-23 18:31:29  Digital channels, Shubhash reddy, Cable operators, TV Channels

హైదరాబాద్, డిసెంబర్ 23: ఈ మధ్య విధించిన ట్రాయ్ నిబంధనలపై శనివారం రెండు తెలుగు రాష్ట్రాల ఆపరేటర్లు, ఎంఎస్‌ఓలు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు నిభందనలకు నిరసనగా త్వరలో వొక రోజు చానళ్ళ ప్రసారాలను నిలిపివేస్తున్నామని ఎంఎస్‌ఓ నేత సుభాష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేబుల్‌ ఆపరేటర్ల జజెఏసిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ట్రాయ్‌ విధించిన కొత్త నిబంధన కారణంగా వొక్కో ఛానల్‌కు రూ.19 భారం పడుతుందని తెలిపారు.

గతంలో ధరలకే సర్వీసులను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ట్రాయ్‌ నిబంధనలకు నిరసనగా వొక రోజు ఛానళ్ల ప్రసారాలను నిలిపివేస్తామన్నారు. ఈనెల 27వ తేదిన ఇందిరాపార్కు వద్ద కేబుల్‌ ఆపరేటర్లు, ఎంఎస్‌ఓల గర్జన నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం కేబుల్‌ ద్వారా ప్రసారం అవుతున్న ఛానళ్లని డిసెంబరు 29న నిలిచిపోనున్నాయి. వినియోగదారుడు కొరుకున్న ఛానళ్లు, ప్యాకేజీల వారీగా ప్రసారాలు పొందవచ్చు. తెలుగు ఛానళ్లనే ఎంపిక చేసుకుంటే రూ.250-350 రూపాయల వరకు వినియోగదారులు చెల్లించాల్సి వస్తుందన్నారు. చిన్నపిల్లలకు సంబంధించిన ఛానళ్లు, స్పోర్ట్‌, ఇంగ్లీషు ఛానళ్లు కావాలంటే అదనంగా వారిటికి డబ్బులు చెల్లించాల్సి వస్తుందన్నారు. 30వ తేది నుంచి ప్రస్తుతం అందుతున్న ఛానళ్లన్ని చూడాలంటే రూ.550-600 వరకు చెల్లించాల్సి ఉంటుందని, ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు చెల్లించలేదని అందుకే తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.