పార్టీ గుర్తుపై ట్వీట్ చేసిన జనసేనాని

SMTV Desk 2018-12-23 18:19:30  Janasena party, Party symbol, Glass, Party office, Pawan kalyan, Twitter

అమరావతి, డిసెంబర్ 23: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీకి ఈసీ గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. ఈ మేరకు శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. చిన్ననాటి నుండి నాకు ఈ గాజుగ్లాసుతో ప్రత్యేక అనుబంధం ఉందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇది దేశంలో సామాన్యుడి గుర్తింపు అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

దేశంలోని 29 పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. ఇందులో భాగంగానే జనసేనకు కూడ ఈసీ గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. కుటుంబసభ్యులతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యూరప్‌ ట్రిప్‌లో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో జనసేన ఈ గుర్తుతోనే పోటీ చేయనుంది.