శారద పీఠాధిపతి స్వామిని దర్శించుకున్న కేసీఆర్

SMTV Desk 2018-12-23 15:14:43  CM,KCR, Vishakapatnam, Sharada peetam

విశాఖపట్నం, డిసెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్ర శేకర్ రావు కుటుంబసభ్యులతో కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం చేరుకున్నారు. అనంతరం శారద పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్రను కేసీఆర్ ఘనంగా సన్మానించారు. ఈ ఆశ్రమం ఆవరణలో ఉన్న రాజశ్యామల ఆలయంలో స్వరూపానందేంద్రతో కలిసి కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి రెండు రోజుల ముందు కూడ కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌లో స్వరూపానందేంద్రతో కలిసి కేసీఆర్ రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. యాగం ముగించుకొని ఆయన ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లను కైవసం చేసుకొంది. దీంతో స్వామి ఆశీస్సులు తీసుకొనేందుకు కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి విశాఖ శారద పీఠానికి వచ్చారు.