చార్మిపై వర్మ కామెంట్స్

SMTV Desk 2017-07-27 11:21:05  ram gopal varma, drugs case, charmi, is, jhansi lakshmi baayi

హైదరాబాద్, జూలై 27 : డ్రగ్స్ వ్యవహారం లో భాగంగా నిన్న చార్మి విచారణ కు హాజరయ్యారు. ఇప్పటి వరకు సిట్ అధికారులు చాలా మందిని విచారించిన విషయం తెలిసిందే. అయితే విచారణకు అందరు వైట్ డ్రెస్ వేసుకొని వస్తే ఒక చార్మి మాత్రం బ్లూ డ్రెస్ వేసుకొని వచ్చారు. ఈ సందర్భంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చార్మి పై పేస్ బుక్ లో కామెంట్స్ చేశారు. వర్మ తన ఫేస్ బుక్ ద్వారా ' సిట్ అధికారుల విచారణ కోసం లోపలి వెళ్లిన చార్మి, వెళ్ళే ముందు కంటే బయటకు వచ్చాక ఆమె అందం మరింత పెరిగిందని అన్నారు. ఆమె ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లా కనిపించిందని, సిట్ అధికారులు ఆమె గోళ్లు కత్తిరించలేదు.' అని వర్మ అన్నారు.