జన సైనికులని కలవరపెడుతున్న విషయాలు

SMTV Desk 2018-12-22 20:42:21  pawan kalyan,janaseena,janaseena kavathu,janaseena song, janaseena asking money

హైదరాబాద్ , డిసెంబర్ 24 : ప్రస్తుత ఆధునిక కాలంలో సెల్ ఫోను , ఇంటర్నెట్ పుణ్యమా అని నాయకులు మాటలేల మారుస్తారో , వాళ్ళ అస్సలు రంగులేంటో జనాలకి తెలుస్తున్నాయి. ఇప్పటికే చాలా రాజకీయ నాయకుల భాగోతాలు మనకి తెలిసాయి తెలుస్తున్నాయి. కాగా అలాంటి వీడియో వొకటి ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తుంది .

వివరాల్లోకి వెళితే ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమెరికా లో ఉంటున్న ప్రవాసాంధ్రుల " హెచ్ 1 బి వీసా" సమస్యల పరిష్కారం కోసం , అక్కడి వ్యవస్థలను అధ్యయనం చెయ్యడం కోసం, ఆ దేశ అధ్యక్షుడులతో చర్చలు జరపడానికి అక్కడికి వెళ్ళిన విషయం మనకి తెలిసిందే . ఈ విషయాన్నీ పవన్ తనే స్వయంగా చెప్పాడు. అక్కడ అధికారుల రియాక్షన్ ఏంటో ఇప్పటికీ సైనికులకు ఎలాంటి సందేశం ఇవ్వలేదు .

ఇది ఇలా ఉంటే జనసేన పార్టీకి సంబంధించి జరిగిన వొక సభలో , ఆ పార్టీ కార్యదర్శలు పార్టీ ఫండ్ అడుగగా , అక్కడికి హాజరయిన వారు "పార్టీ వెబ్సైటులో డబ్బులు ఇవ్వకూడదని ఉంది కదా " అని ప్రశ్నించగా , డబ్బులు చేతికి ఇవ్వకూడదు కానీ , క్యాష్ రూపంలో గాని చెక్ రూపంలో గాని ఇవ్వొచ్చని బదులిచ్చారు . లీక్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది .ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో డబ్బులేకుండా పార్టీ మనుగడ కష్ట సాధ్యం , అలాఅనుకుని ఈ విషయాన్ని పక్కనే పెట్టే ముందు డల్లాస్ సభలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ ని వొకసారి పరిశీలిస్తే , పవన్ పలుమార్లు "నాకు ఆత్మ గౌరవం ఎక్కువ ,నేను డబ్బులు అడగడానికి రాలేదు " అని చెప్పాడు అంతే కాకుండా ఇది వరకు చాలా సార్లు ఈ విషయం మీద తీవ్రమయిన వ్యాఖ్యలు బలంగా చేసాడు. కాగా ఇప్పుడు ఇలాంటి వీడియో బయటికి రావడం తో కథ అడ్డం తిరిగేలాగా ఉంది.ఈ విషయం పై జనసేనాని ఇంకా ఎలాంటి వివరణా ఇవ్వలేదు . కాగా ప్రతినాయకులు మాట్లాడే సమయంలో దొర్లిన తప్పుల్ని హెలైట్ చేసే కించ పరుస్తూ ట్రోల్ చేసే జనసైనికులు , ఎదుట వాళ్ళకి కూడా అలాంటి అవకాశం ఇచ్చారు , దాంతో ఈ వీడియోతో టీడీపీ , వైస్సార్సీపీ వర్గాలు ఆడేసుకుంటున్నాడు .