విరాట్ ని ట్రోల్ చేస్తున్న ఆసిస్ నెటిజన్లు

SMTV Desk 2018-12-22 19:53:47  Virat kohli, Dennis tareen, Team india, Twitter, Australians

న్యూఢిల్లీ , డిసెంబర్ 22: భారత్ ఆసిస్ మధ్య జరిగిన రెండో టెస్టులో భారత్ పరాజయ పాలవడం వల్ల అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక పెర్త్ టెస్ట్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ మాటల యుద్ధంపై ఆస్ట్రేలియా మీడియాతో పాటు ఆ జట్టు మాజీ ఆటగాళ్లు కోహ్లీ తీరును తప్పుబడుతూ పలు రకాలుగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఆసీస్ మాత్రం కోహ్లీ అంటే అంతెత్తున్న ఎగిరిపడుతోంది. ఆస్ట్రేలియాలోని ప్రధాన దినపత్రికలు, ఛానెళ్లు, వెబ్‌సైట్లలో కోహ్లీ, టీమిండియాలకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురితమవుతున్నాయి. తాజాగా ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్ డెన్నిస్ టరీన్... విరాట్ కోహ్లీపై అభ్యంతరకర రీతిలో ట్వీట్ చేశారు.‘‘ మైదానంలో మనకు అనుకూలంగా ఏదీ జరగనప్పుడు ఎలా ప్రవర్తించాలో కోహ్లీ మనకు చూపిస్తున్నాడంటూ క్యాప్షన్ పెట్టి ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో విరాట్ అభిమానులతో పాటు నెటిజన్లు డెన్నీస్‌పై మండిపడుతున్నారు. కోహ్లీ ఎప్పుడైనా బ్యాటు నేలకేసి కొట్టడం, కుర్చీలను తన్నడం మీరు చూశారా అంటూ డెన్నిస్‌ను ఉద్దేశిస్తూ కామెంట్లు పెడుతున్నారు.