ధర్మపోరాట సభలో ప్రతిపక్షం పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

SMTV Desk 2018-12-22 19:42:13  AP CM, Chandrababu, YSRCP, Janasena, Jagan mohan reddy, Pawan kalyan, pethai toofan

శ్రీకాకుళం, డిసెంబర్ 22: జిల్లాలోని ధర్మపోరాట సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెదేపా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ చీఫ్ జగన్,జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణలో టీఆర్ఎస్‌కు వైసీపీ మద్దతు పలికిందన్నారు. తెలంగాణాలో టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ సంబంరాలు చేసుకొంటున్నారని వైసీపీపై చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు.
పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ తిత్లీ తుఫాన్ కారణంగా నస్టపోయిన ప్రజలను పరామర్శించేందుకు టైమ్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌, పవన్‌లు లాలూచీ రాజకీయం చేస్తున్నారని.. తనకు లాలూచీ రాజకీయం అవసరం లేదని బాబు విమర్శించారు.