'శ్రీనివాస రామానుజం' జన్మదినం

SMTV Desk 2018-12-22 18:36:25  srinivasa ramanujan,cbn,mathematician,bharath,hindhuism,tamilnadu,erode,kumbakonam

భారత్ , డిసెంబర్ 22 :ఈ రోజు గణితశాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజం జన్మదినం . ఈయన 1887డిసెంబర్ 22తేదీన అయ్యంగార్ల వంశంలో కోమలతమ్మాల్ శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు, తమిళనాడు లోని ఎరోడ్ లో జన్మించాడు.

ఆయన 13 ఏళ్ళ వయసులోనే గణితంలో ని భాగమయిన " త్రికోణమితి" ని అవపోశన పట్టాడు . ఆయన చదువుకునే రోజుల్లో ద్రుష్టి మొత్తం కేవలం గణితం,మీద ఉంచి , మిగిలిన సబ్జక్ట్స్ లో తప్పేవాడు . అప్పటి ఉపాధ్యాయులకు గణితం పట్ల ఈయన చూపిన శ్రద్ధ చాలా విభిన్నం గా తోచేది , కాని వారినుండి రామానుజం కి ఎలాంటి గుర్తింపు లభించకపోవడంతో , 1913 లో అతను ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ గణిత శాస్త్రజ్ఞుడు జి. హెచ్. హార్డీతో వొక పోస్టల్ భాగస్వామ్యాన్ని ప్రారంభించాడు. అతను పంపిన అసాధారణ పనిని గుర్తిస్తూ, హార్డీ రామానుజాన్ కి కేంబ్రిడ్జ్కు ప్రయాణాన్ని ఏర్పాటు చేశాడు. తన నోట్స్ లో, రామానుజన్ నూతనమైన సిద్ధాంతాలను తయారుచేసాడు, వాటిలో కొన్ని హార్డీ,అతని సహోద్యోగులు ఎవరూ ఛేదించలేక పోయారు.

1920 లో అనారోగ్య కారణాల వల్ల భారతదేశానికీ తిరిగి వచ్చాడు . 32 ఏళ్ళ అతి చిన్న జీవితం లో ఆయన స్వతంత్రంగా 3,900 ఫలితాలను సంకలనం చేశాడు వాటిలో ఎక్కువగా గుర్తింపులు , సమీకరణాలు ఉన్నాయి .అతని జీవితం యొక్క చివరి సంవత్సరం లో రాసిన అతని "లాస్ట్ నోట్బుక్", ని 1976 లో తిరిగి కనుగోన్నప్పుడు గణిత శాస్త్రజ్ఞులలో గొప్ప ఉత్సాహం కలిగించి అత్యంత అధునాతన ఫలితాలు వెలువడ్డాయి.

ఆయన వొక లోతయిన ఆత్యాద్మిక వేత్త , ఆయన ఏది చేసిన తమ వంశ కులదేవత కరుణ లేకపోతే అది వృథా అని నమ్మేవారు . అంతే కాకుండా అతనికి ఇంత పాండిత్యం రావడనికి కారణం ఈ ధర్మమని చెప్పేవాడు .

శ్రీనివాస రామానుజం గారికి 1909 జూలై 14 న జానకి(జనకమ్మాల్) తో వివాహం జరగగా 1920 ఏప్రియల్ 26న ఆయన మరణించాడు .