మరోసారి ప్రతిపక్షం పై మండిపడ్డ దేవినేని

SMTV Desk 2018-12-22 17:06:49  TDP, Minister, Devineni uma, Narendra modi, YSRCP, Jagan mohan reddy, BJP

అనంతపురం, డిసెంబర్ 22: తెదేపా మంత్రి దేవినేని ఉమ మరోసారి ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగడం అటు ప్రధాని మోదికి, ఇటు విపక్ష నేత జగన్‌కు ఇష్టం లేదని మండిపడ్డారు. పోలవరంపై పక్క రాష్ట్రలతో కేసులు పెట్టిస్తున్నాడని జగన్‌ను దూషించారు.

తెలుగు జాతిపై మోది కక్ష గట్టారని ,వచ్చే నెల ఏపికి మోది రాకను తాము అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులను కేంద్రం వెనక్కు తీసుకుందని ,అందుకే కేంద్రం వంచనకు ఈ నెల 26న ధర్మ పోరాట దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ దీక్షకు సియం చంద్రబాబు హాజరవుతారని మంత్రి వెల్లడించారు.