ముమైత్ ను కీలకంగా భావిస్తున్న సిట్

SMTV Desk 2017-07-27 10:34:56  mumaith khaan, drugs issue, sit officers

హైదరాబాద్, జూలై 27 : సిట్ కార్యాలయానికి చేరుకున్న ముమైత్ ఖాన్ ను నలుగురు మహిళా అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటివరకు ఏడుగురిని ప్రశ్నించిన అధికారులు ముమైత్ నుంచి మరింత సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ కేసులో ముమైత్ ను కీలకంగా భావిస్తున్న అధికారులు కెల్విన్ ఫోనులో ముమైత్ ఫోన్ నంబర్, అంతేకాకుండా వాట్సప్ చాటింగ్ ను అధికారులు గుర్తించారు. కెల్విన్ తో ఆమె దిగిన సెల్ఫీ ఫోటోలను అధికారులు సేకరించినట్లు తెలుస్తుంది.