ప్రియా ప్రకాశ్ వారియర్ సినిమా తెలుగులోకి

SMTV Desk 2018-12-22 17:04:40  priya prakash varriar,oru adar love,tamil dubbing movies,telugu dubbing movies

కేరళ, డిసెంబర్ 22 : వొరు ఆదార్ లవ్ ఈ సినిమా నుంచి వదిలిన వొక టీజర్ లో కన్నుగీటిన ప్రియా వారియర్ ను చూసి కుర్రాళ్లంతా మనసు పారేసుకున్నారు. ఈ వొక్క సినిమాతో ఆమె సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు, ఇంస్టాగ్రామ్లో ఏకంగా 6మిలినియన్ల ఫాలోయర్స్ ని సంపాదించిపెట్టుకుంది . ఆ రోజు నుంచి ఇప్పటికి ఈమె పేరు కుర్ర నాలుకలపై నానుతూనే వుంది. వొమర్ లులు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

గురురాజ్ వినోద్ రెడ్డి ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. తాజాగా వాళ్లు మాట్లాడుతూ .. "గట్టి పోటీని ఎదుర్కొని ఈ సినిమా తెలుగు హక్కులను మేము దక్కించుకున్నాము. ప్రేమికుల దినం సందర్భంగా లవర్స్ డే అనే పేరుతో ఈ సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నాము. ఇంతటి క్రేజీ ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం మాకు చాలా సంతోషంగా వుంది" అని వెల్లడించారు .