' అసురన్ ' గా ధనుష్

SMTV Desk 2018-12-22 16:47:11  ausran,danush,maari2

చెన్నై ,డిసెంబర్ 22 : చెన్నై ,డిసెంబర్ 22 : ధనుశ్ తమిళంలో కొత్తదనానికి , కొత్త వాళ్ళకి ప్రాధాన్యతనిచ్చే యువకథానాయకులలో ముందు వరుసలో ఉంటాడు . నటన లోనే కాదు కథాకథనాలపై ధనుశ్ కి మంచి పట్టువుండడం వలన స్పీడ్ గా కథలను ఓకే చేసుకుని సెట్స్ పైకి వెళ్లిపోతుంటాడు. అలా మారి 2 తో నిన్ననే ప్రేక్షకులను పలకరించిన ధనుశ్, ఈ రోజున తన తరువాత చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసాడు .
వెట్రిమారన్ ధనుశ్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ధనుశ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందువలన ఈ ఇద్దరూ కలిసి అసురన్ అనే టైటిల్ ను ఖరారు చేసుకుని మరోమారు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. వి.క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

ఈ లుక్ లో ధనుష్ మాత్రం చాలా మొరటోడిలా కనిపిస్తున్నాడు