మరికాసేపట్లో సిట్ ఎదుట ముమైత్ ఖాన్

SMTV Desk 2017-07-27 09:59:47  tollywood, mumaith khan, drugs issue, sit officers

హైదరాబాద్, జూలై 27 : టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో నేడు ముమైత్ ఖాన్ ను విచారించనున్న సిట్ అధికారులు. సిట్ నోటీసులు జారీ చేసిన నేపధ్యంలో బిగ్ బాస్ షో నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న ముమైత్.. పూణే నుండి హైదరాబాద్ చేరుకోగా, మరికాసేపట్లో సిట్ కార్యాలయం ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసులో కెల్విన్ తో సంబంధం గురించి అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే ఇంతకు ముందే పూరి, సుబ్బరాజు, చార్మి ఇతరులు చెప్పిన సమాచారం ఆధారంగా ముమైత్ నుంచి మరింత కీలక విషయాలను రాబట్టనున్నారు.