పెరిగిన సముద్ర నీటిమట్టం.. ముంచుకొస్తున్న ముప్పు..

SMTV Desk 2018-12-22 15:44:56  INCOIS Hyderabad, Ocean Information

హైదరాబాద్, డిసెంబర్ 22: భారత దేశానికి గ్లోబల్ వార్మింగ్ సవాల్ విసురుతోంది. దీని దెబ్బకు భారత సముద్ర తీర నీటిమట్టాలు పెరిగాయి. గుజరాత్ రాష్ట్రంలోని ఖంబట్, ముంబైతో పాటు దక్షిణ కేరళలోని కొంకణ్ ప్రాంతాల్లో నీటి మట్టం పెరిగిందని హైదరాబాదులోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్మర్మేషన్ సర్వీసెస్ (INCOIS) తన తాజా అధ్యయనంలో తెలిపింది. 2.8 అడుగుల మేర సముద్ర నీటి మట్టం పెరిగిందని ఈ సంస్థ వెల్లడించింది. దీని వల్ల రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

సముద్ర నీటి మట్టం పెరిగితే నదుల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. ముఖ్యంగా గంగ, కృష్ణ, కావేరి, మహానది డెల్టా ప్రాంతాలు ముప్పును ఎదుర్కొంటాయి. దీని వల్ల దక్షిణ భారతంలో 2050 నాటికి తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్ర నీటిమట్టం పెరిగితే భూగర్భ జలాలు ఉప్పు కయ్యలుగా మారి, వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారుతుందని కేంద్ర పర్యావరణ శాఖ సహాయమంత్రి మహేష్ శర్మ తెలిపారు. తీర ప్రాంత పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.