అది 'కాంచన 3' క్రేజ్ అంటే

SMTV Desk 2018-12-22 15:25:33  kanchana, lawrence, raghava,kanchna3,ganga

హైదరాబాద్,డిసెంబర్ 22 : హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో లారెన్స్ ప్రావీణ్యుడు . ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను సాధించాయి. దాంతో కాంచన సిరీస్ లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఉన్నారు .

లారెన్స్ కాంచన 3 సినిమాను ఏప్రిల్ 18వతేదీన విడుదల చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించాడు. దాంతో అందరిలోను కుతూహలం ఎక్కువవుతోంది. కాంచన 3 ని తమిళ .. తెలుగు భాషలతో పాటు మలయాళంలోను లారెన్స్ విడుదల చేయనున్నాడు. ఇంతకు ముందు వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమాల కంటే ఈ సినిమా మరింతగా భయపెడుతుందని మరీ చెప్పాడు. కాంచన సిరీస్ లోని సినిమాలకి భారీ వసూళ్లు వచ్చినందు వలన , కాంచన 3 తెలుగు హక్కులకి డిమాండ్ బాగా పెరిగింది వాటి కోసం చాలామంది నిర్మాతలు పోటీపడుతున్నారట. చివరికి తెలుగు హక్కులు ఎవరి చేతికి దక్కుతాయో చూడాలి మరి.