పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కోటాలపై కీలక నిర్ణయం

SMTV Desk 2018-12-22 15:08:06  Sarpanch elections, Telangana, Election commity, Reseravtions,

హైదరాబాద్, డిసెంబర్ 22: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల కోటాలపై శుక్రవారం నిర్ణయం తీసుకొని పంచాయతీరాజ్ శాఖ ద్వారా జిల్లా కలెక్టర్లకు, డీపీవోలకు ఆ వివరాలు పంపించింది. వాటిలో బీసీలకు 23.81 శాతం, ఎస్సీలకు 20.46 శాతం, ఎస్టీలకు 5.73 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించింది.

దీని కోసం 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. కానీ బీసీ రిజర్వేషన్లను మాత్రం తాజా ఓటర్ల జాబితా ప్రకారం లెక్కించాలని ఆదేశించింది. వాటిలో అన్ని కేటగిరీలలో మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయిస్తారు. శనివారం జిల్లా స్థాయిలో పంచాయతీ అధికారుల సమావేశం జరుగుతుంది. దానిలో ఈ రిజర్వేషన్ల అమలుకు సంబందించి లోతుగా చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తారు.