మళ్ళీ ప్రభాస్ తో అనుష్కా

SMTV Desk 2018-12-22 13:41:58  prabhas,saaho,bahubali,darling,anushka,pooja hegde,radha krishna,sujith

హైదరాబాద్ , డిసెంబర్ 22 :సుజిత్ దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఇంకొక సినిమా చేస్తున్నాడు రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్నఈ సినిమా ఇంతవరకూ వొక షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. ఇది 1960ల కాలం నాటి అద్భుతమైన ప్రేమకథ అనే విషయం తాజాగా బయటికి రావడంతో ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది.

సోషల్ మీడియాలో ఈ ప్రేమకథ గురించిన అప్డేట్ ఇవ్వాలని పోస్టులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు రాధాకృష్ణ "ప్రభాస్ అభిమానులు తొందరపడొద్దు అన్ని ఆసక్తికరమైన విశేషాలను సమయం వచ్చినప్పుడు రివీల్ చేస్తాము " అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీమంతుడిగా, పాతకాలం నాటి కార్లను ఇష్టపడే వ్యక్తిగా కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే చేస్తుంది . ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మరో కథానాయిక ఉంటుందనీ, ఆ పాత్ర కోసం అనుష్కను సంప్రదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.