బెస్ట్‌ స్మార్ట్‌ సిటీ సర్వేలెన్స్‌ అవార్డు అందుకున్న నగర పోలీసు విభాగం

SMTV Desk 2018-12-22 12:54:14  Hyderabad city Police, Best smart city servalance award, Economic times, Best smart Arman award, Inspector Narsingarao, New delhi

హైదరాబాద్, డిసెంబర్ 22: పోలీసులు నగరంలో సిసి కెమెరాల ఏర్పాటుతో పాటు వాటిని నిరంతరం పద్దతి ప్రకారం నిర్వహిస్తూ నేరాల నివారణలో కీలక భూమిక వహించేలా చూస్తున్నందుకు బెస్ట్‌ స్మార్ట్‌ సిటీ సర్వేలెన్స్‌ అవార్డును ఎకనామిక్‌ టైమ్స్‌ సంస్థ పోలీసు విభాగానికి ప్రకటించింది.

టెక్నాలజిని వాడుతూ నేరాల నివారణకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని టైమ్స్‌ సంస్థ ఈ సందర్భంగా అభినందనలు తెలిపింది. దీంతో పాటు పట్టణ ప్రాంతంలో ట్రాఫిక్‌ను సరైన విధంగా నిర్వహిస్తున్నందుకు బెస్ట్‌ స్మార్ట్‌ అర్మన్‌ ట్రాఫిక్‌ అవార్డును కూ డా సిటీ పోలీసు విభాగానికి దక్కింది. ఈ అవార్డులను నగర పోలీసు విభాగం తరపున ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌, టెక్నాలజి విభాగం ఇన్‌స్పెక్టర్‌ నర్సింగ్‌రావు ఢిల్లీలోని తాజ్‌ మహల్‌ హోటల్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డులను అందుకున్నారు.