ప్రాచీన ఆంధ్రచరిత్ర సృష్టి కర్త 'గౌతమీపుత్ర శాతకర్ణి' : బాలకృష్ణ

SMTV Desk 2018-12-22 12:47:43  Ntr, Nbk,Tdp,Andhra pradesh, Telugu, Amarvathi,Ntr biopic,young tiger, Legend,lion,andhra tiger

హైదరాబాద్,డిసెంబర్ 22 : 'తెలుగు టైగర్' అన్న నందమూరి తారకరామారావు గారి అమరజీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన యన్ . టి . ఆర్ కథానాయకుడు , మహానాయకుడు సినిమాల ఆడియో వేడుక నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని జె . ఆర్ . సి కన్వెన్షన్ హాల్ లో , అభిమానుల మహామహుల సమక్షం లో లాంచనంగా జరిగింది. పలువురు ప్రముఖులు అన్నగారితో తమకున్న అనుబంధాన్ని తలుచుకున్నారు.

ఆ సంధర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటుంది " మాతృ, పితృ,గురు" లను స్తుతిస్తూ శ్లోకం తో మొదలయిన ఆయన మాటలు తల్లిదండ్రులు, తెలుగు భాష ,అభిమానులు,సినిమా,కార్య దీక్ష ఇలా పలు అంశాలని స్మృసిస్తూ సాగాయి.

వివరాల్లోకి వెళ్తే " ప్రాచీన ఆంధ్ర చరిత్ర సృష్టి కర్త " గౌతమీపుత్ర శాతకర్ణి " ఆధునిక ఆంధ్ర చరిత్ర సృష్టి కర్త "నందమూరి తారకరామారావు". తెలుగు భాష పేరు చెబితే నా రక్తం ఉప్పొంగుద్ది , అలాగే యన్ . టి . ఆర్ అనే మూడు అక్షరాలు చెప్పినా అంతే . తెలుగు భాష ముఖ్యం , నా సినిమాలు ఆడినా ఆడక పోయినా వాటిలోని సంభాషణలు ద్వారా కూడా మన భాష పలకబడడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇంతకంటే నా జీవితానికి ఏం కావాలి?. పౌరాణిక పాత్రలు చెయ్యడం ఏంటి? బాలకృష్ణకి పిచ్చో పైత్యమో అని కథనాలు రావొచ్చు , ఏమయినా అనుకోండి , కానీ సినిమాకి ఎంత వరకూ అవసరమో అంత వరకే ఉంచాం సినిమా చూస్తే మీకు తెలుస్తుంది . దర్శకుడు క్రిష్ గారు ప్రతి పాత్రను అద్భుతంగా మలిచారు. ఈ చిత్రాన్ని డబ్బు ఆశించి తీయడం లేదు మా పితృ దేవతలు బసవతారకం రామారావుల సంకల్పం తో నాచేత చేయబడుతుంది ఇందులో నా గొప్పేమి లేదు . ఈ సినిమా హిందీ , తమిళ , కన్నడ భాషలలోకి కూడా డబ్ అవుతోంది. నువ్వు ఎవరూ ? అని అడిగితే ముందు భారతీయుడిని, ఆతరువాత తెలుగోడిని, ఆతరువాత నందమూరి తారకరామారావు గారి తనయుడిని ,ఇంకా ఆడితే అన్న గారి అభిమానినని సగర్వంగా చెబుతా " ఈ విధమంగా సుమారు 34 నిముషాల సంభాషలనలో ఎన్నో జ్ఞాపకాల్ని మరెన్నో అలనాటి స్మృతుల్ని గుర్తుచేస్కుని వివరించారు.

అగ్ర తారాగణం లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జనవరి 9 న ఫిబ్రవరి 7 న రెండు భాగాలుగా విడుదల చెయ్యనున్నారు . వారాహి చలన చిత్రం , యన్ . బి . కె ఫిలిమ్స్ యల్ యల్ పి బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు .

తెలుగు జాతి కి దేశ రాజకీయాల్లో గొంతుని సుస్థిర స్థానాన్ని, తెలుగువాడి వేడిని దేశానికి తాకించిన యుగపురుషుడి జీవిత గాధను చూడటానికి ఇరు తెలుగు రాష్ట్రాలే కాక , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగోళ్ళు ఎదురుచూస్తున్నారు .