రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటాలి : అర్వింద్‌ కుమార్‌

SMTV Desk 2018-12-22 12:41:43  Hyderabad city, HRDCL, Arvind kumar, Road devolopment construction

హైదరాబాద్, డిసెంబర్ 22: నగరలో హెచ్‌ఆర్‌డిసిఎల్‌ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలసి పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ పర్యవేక్షించారు.

ఈ నేపథ్యంలో అర్వింద్‌ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్‌ రోడ్డు డెవలప్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ పరిధిలో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి పనులలో పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అమీర్‌పేట (కనకదుర్గ గుడి) నుంచి ఫతేనగర్‌ జంక్షన్‌ (3.5 కి.మీ.) గ్రీన్‌లాండ్స్‌ టు అమీర్‌పేట (1.2 కి.మీ.), రసూల్‌పుర జంక్షన్‌ టు రాణిగంజ్‌ జంక్షన్‌ (మినిస్టర్‌ రోడ్‌-1.7) కి.మీ సనత్‌నగర్‌ గూడ్స్‌ షెడ్‌ టు మూసాపేట జంక్షన్‌ (1.32 కి.మీ.) రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతున్న చోట రీడిజైనింగ్‌, రీ మోడలింగ్‌ పనులను వేగవంతం చేయాలని సూచించారు.

ల్యాండ్‌స్కేపింగ్‌, ఫుట్‌పాత్‌, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, రోడ్‌ మార్కింగ్‌, స్ట్ట్రీట్‌ లైటింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్డు అభివృద్ధి పనులలో భాగంగా రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటించాలనీ, అంతేకాకుండా వాటి పరిరక్షణకు సైతం చర్యలు చేపట్టాలన్నారు.