ఆమ్‌ఆద్మీ పార్టీకి కొత్త తలనొప్పులు..!

SMTV Desk 2018-12-22 12:35:01  Aam Admi Party, Delhi, Aravind Kejriwal, Alka Lamba, Rajeev Gandhi

న్యూఢిల్లీ, దొసెంబర్ 22: కాంగ్రెస్ నేత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి ఇచ్చిన దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీ అసెంబ్లీ చేసిన తీర్మానం ఆమ్‌ఆద్మీ పార్టీకి తలనొప్పులు తీసుకొచ్చింది. ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ పార్టీ శాసనసభ్యురాలు ఆల్కా లాంబా శనివారం తెలిపారు. సభలో చర్చ సందర్భంలోనే తాను వ్యతిరేకించి సభ నుంచి బయటకు వచ్చినట్లు చాందినీ చౌక్‌ ఎమ్మెల్యే ఆల్కా లాంబా తెలిపారు.

కాగా సిక్కు వ్యతిరేక అల్లర్లలో రాజీవ్‌ గాంధీపై కూడా ఆరోపణలు ఉన్నాయని, ఆయనకిచ్చిన దేశ అత్యున్నత పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలిన ఢిల్లీ అసెంబ్లీ తీర్మానించిన విషయం తెలిసిందే. ఆల్కా లాంబాంతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేసిన పార్టీ నాయకత్వం శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. పార్టీ ఆదేశిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె ప్రకటించారు.