ఆస్పత్రిలో చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యె

SMTV Desk 2018-12-22 12:23:23  Akbaruddin owaisi,MIM, Hospital, Kanchan bagh

హైదరాబాద్, డిసెంబర్ 22: చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యె, మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ అనారోగ్యానికి గురయ్యారు. గురువారం తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. కంచన్‌బాగ్‌లోని ఓ ఆస్పత్రిలో ఓవైసీ చికిత్స పొందుతున్నారు. ఆయనకు మొదటి అంతస్తులో ప్రత్యేక గదిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

గురువారం రాత్రి ఓ విందుక హాజరైన సమయంలో ఆక్బరుద్దీన్‌కు తీవ్రమైన కడుపునోప్పి వచ్చింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సోదరుడు అసుద్దీన్‌ ఓవైసీలు ఆసుపత్రికి చేరుకొని ఆయనను పరామర్శించి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలిపేందుకు ఆసుపత్రి వర్గాలు నిరాకరించాయి. కుటుంబ సభ్యుల మినహా మిగతా ఎవరినీ ఆసుపత్రి లోపలికి అనుమతించడంలేదు.