సంచలనం రేపిన నితీష్ రాజీనామా

SMTV Desk 2017-07-26 19:42:15  beehar, cm nithishkumar, To resign govarnar

బీహార్, జూలై 26 : బీహార్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం కారణంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ గవర్నర్ కి రాజీనామా సమర్పించి మీడియాతో మాట్లాడుతూ, జేడీ యూ , ఆర్జేడీ మధ్య ముదిరిన వివాదం తేజస్వి యాదవ్ రాజీనామాకు నేను కోరలేదని, తేజస్వి పై ఆర్జేడీ నిర్ణయం ప్రకటించాలని కోరానన్నారు. తలెత్తిన వివాదానికి రాజీనామా చేయడం తప్ప మరో మార్గం తమకు కనిపించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకునట్లు ఆయన తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని, సంకీర్ణ ధర్మాన్ని కాపాడేందుకు చివరి క్షణం వరకు కృషి చేశానన్నారు. రాహుల్ గాంధీతో కూడా మాట్లాడాక ఇక కలిసి పనిచేయడం సాధ్యంకాదని భావించానని పేర్కొన్నారు. నీతి, నిజాయితీకి కట్టుబడి ఉంటానని అంతరాత్మ ప్రబోధంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, నా ఆలోచనా తీరు వేరు, లాలూ విధానాలు వేరు ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడండని ఆయన అన్నారు.