' యన్ . టి . ఆర్ ' తెలుగు జాతి సొత్తు : జూనియర్ యన్ . టి . ఆర్

SMTV Desk 2018-12-22 11:28:20  Ntr, Nbk,Tdp,Andhra pradesh, Telugu, Amarvathi,Ntr biopic,young tiger, Legend,lion,andhra tiger

హైదరాబాద్,డిసెంబర్ 22 : తెలుగు ప్రజల ఇలవేల్పు అన్న నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యన్ . టి . ఆర్ కథానాయకుడు,మహానాయకుడు సినిమాల ఆడియో వేడుక నిన్న సాయంత్రం " జె . ఆర్ . సి కన్వెన్షన్ " హాల్ లో మహామహుల , అభిమానుల సమక్షం లో లాంచనంగా జరిగింది. ఆ సంధర్భంగా పలువురు ప్రముఖులు అన్నగారితో తమకున్న అనుబంధాన్ని తలుచుకున్నారు .

అందులో భాగంగా జూనియర్ యన్ . టి . ఆర్ మాట్లాడుతూ " వొకానొక సమయం లో మనం తెలుగు వాళ్ళని వేరే రాష్ట్ర ప్రజలగా అభివర్ణించి , హేళనగా చూసే వాళ్ళకి ఇది రా తెలుగు జాతి , అది రా తెలుగు ఖ్యాతి అని తొడగొట్టి చాటిన ఎందరో ప్రముఖులలో " అన్న " గారు అగ్రగణ్యుడు . వొక సినిమాకి హిట్,ప్లాప్ అని ఉంటాయి కానీ చరిత్ర కి ఉండదు , వొక చరిత్రని సినిమాగా మలచడమే వొక చరిత్ర . యన్ . టి . ఆర్ అంటే వొక కుటుంబానికో , వొక ఊరికో చెందిన వ్యక్తి కాదు ప్రతి తెలుగు వాడు తమ అభిమానం తో సృష్టించిన శక్తి . మా కొడుకు మా తాత గురించి అడిగితే , ఇదిగో మీ తాత తీసిన సినిమా అంటూ ఈ సినిమాని సగర్వంగా చూపిస్తా " అంటూ తాత పట్ల తనకున్న అభినాన్నని సుదీర్గంగా వివరించారు .