జనసేనాని ట్రెండింగ్ ఆన్ ట్విట్టర్

SMTV Desk 2018-12-21 19:51:08  Andhrapradesh, Janasena party, Pawan kalyan, Twitter

అమరావతి, డిసెంబర్ 21: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలు అలాగే జనసైనికులను ఉద్దేశ్యించి తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా తమకు ఎన్నికలపై అలాగే రాష్ట్ర సాధనకై పట్టు కోసం ట్వీట్ చేశారు.

"సూర్యుడు ఉత్తరాయనంలోకి వచ్చే సంక్రాంతి నుంచి జనసేన ఎన్నికల బరిలోకి దూకే క్రాంతి సమయం ఆరంభం కానుంది. అందుకే జనవరి వొకటో తారీకు నుండి క్షేత్ర స్థాయి పర్యటనలతో పాటు ఇక నాయకులందరికీ అనుక్షణం అమరావతిలో అందుబాటులో వుంటాను. ఇప్పటికే జనసైనికుల కవాత్తు ధ్వనితో ఆంధ్ర రాష్ట్రం పరవళ్ళు తొక్కుతోంది.
రండి...కొత్త తరాన్ని నిలబెడదాం
నిలిచి కొత్త బావుటా ఎగరేద్దాం
కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం

అంటూ తన పార్టీ జన సైనికులకు వచ్చే ఎన్నికల్లో తమ సంకేతాన్ని తెలిపారు.