మూడు టీవీ ఛానల్స్ పెట్టనున్న సూపర్ స్టార్!

SMTV Desk 2018-12-21 19:05:52  Rajinikanth, TV Channels

చెన్నై, డిసెంబర్ 21: రోబో సీక్వెల్ 2.ఓ, పెట్టా సినిమాలతో జోరుమీదున్న సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా రాజకీయ రంగంలోనూ అడుగులు వేస్తున్నారు. రాజకీయ ప్రవేశంలో భాగంగా రజనీ కాంత్ మూడు టీవీ ఛానల్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళనాడులోని రాజకీయ పార్టీలు డీఎంకే కు కలైంజర్ టీవీ, అన్నాడీఎంకేకు జయ టీవీ వంటి ఛానల్స్ ఉన్నాయి. ఇదే తరహాలో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు, ప్రజలకి చేరువ అయ్యేందుకు తనకు సొంత ఛానళ్ల అవసరం ఉందని రజనీ భావిస్తున్నట్లు సమాచారం.

రజనీకాంత్ టీవీ, సూపర్ స్టార్ టీవీ, తలైవా టీవీ పేర్లతో మూడు ఛానల్స్ ను ఆయన ప్రారంభిస్తారని సమాచారం. ఛానళ్ళకు సంబంధించిన లోగోలను కూడా రజనీ అనుచరులు రిజిస్టర్ చేయించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే రజనీకాంత్ దీనికి సంబంధించి అధికార ప్రకటన వెలువరిస్తారని పేర్కొన్నారు.