'దటీజ్ మహాలక్ష్మి' టీజర్ రిలీజ్.!

SMTV Desk 2018-12-21 18:40:57  That is Mahalakshmi, Trailer, Thamanna

హైదరాబాద్, డిసెంబర్ 21: హిందీలో కంగనా రనౌత్ చేసిన క్వీన్ మూవీ ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇతర భాషల్లోను ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్ లో తమన్నా ప్రధాన పాత్రధారిగా చేస్తోన్న ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి నాగ చైతన్య, తమన్నా జంటగా నటించిన 100% లవ్ చిత్రంలోని దటీజ్ మహాలక్ష్మి అనే సాంగ్ ని టైటిల్ గా ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. (That Is Mahalakshmi teaser: Tamannaah Bhatia stars in the lead role in the Telugu adaptation of Queen. The Hindi film starred Kangana Ranaut in the lead role.)



దటీజ్ మహాలక్ష్మి సినిమాలో తమన్నా రాజమండ్రి దగ్గరలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఫ్రాన్స్ వెళ్లిన అమ్మాయిగా నటిస్తుంది. అక్కడ ఆ అమ్మాయికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. మహాలక్ష్మి అమాయకత్వం, రాజమండ్రిపై ఆమెకి గల ప్రేమ .. విదేశంలో ఆమె పడిన ఇబ్బందులనే ఈ టీజర్ లో చూపించారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.