ప్రధాని అభ్యర్థిత్వంపై ఆసక్తి లేదు : నితిన్ గడ్కరీ

SMTV Desk 2018-12-21 17:40:51  Narendra Modi, RSS, 2019 Lok Sabha Elections, Nitin Gadkari

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రధాని నరేంద్ర మోదీ స్ధానంలో తాను ముందుకు రాబోనని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న మంత్రి స్ధానం తనకు చాలా సంతృప్తికరంగా ఉందని.. ప్రధాని రేసులో ఉండాల్సిన పనిలేదని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలంటే నితిన్‌ గడ్కరీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని మహారాష్ట్రకు చెందిన రైతు నేత కిషోర్‌ తివారీ ఆరెస్సెస్‌ చీఫ్‌కు లేఖ రాయడాన్ని ప్రస్తావించగా నితిన్‌ గడ్కరీ ఈ మేరకు స్పందించారు.("No there is no chance. I am happy where I am right now. I have to complete Ganga work first, building of Express Highway Access Control in 13-14 countries and I also want to make roads for Chaar Dhams and other works. I am happy doing these works and want to complete it.")



తాను ముందుగా గంగా నదీ ప్రక్షాళన పనులు పూర్తిచేయాలని, రహదారి ప్రాజెక్టులతో పాటు ఇంకా ఎన్నో ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని, ఈ పనులను పూర్తిచేసేందుకు సమయం వెచ్చించాల్సి ఉందన్నారు. ప్రధాని అభ్యర్థిత్వంపై తనకు ఆసక్తి లేదని పేర్కొన్నారు.