టీఆర్ఎస్‌లో విలీనం కోరుకున్న ఎమ్మెల్సీలపై ఉత్తమ్ వేటు

SMTV Desk 2018-12-21 16:33:37  TRS, Congress party, Uttam kumar reddy, MLC

హైదరాబాద్, డిసెంబర్ 21: తమను టీఆర్ఎస్‌లో విలీనం చేయాల్సిందిగా ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్‌కు ఇచ్చిన లేఖని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా వ్యతిరేఖిస్తూ శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీలు శుక్రవారం నాడు శాసనమండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి,ప్రభాకర్ రావు, ఆకుల లలిత, సంతోష్ కుమార్ లు స్వామిగౌడ్ కు లేఖ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.[TPCC Chief Uttam Kumar & Shabbir Ali Meets With Swami Goud Over Congress LP To Merge In TRS]


పార్టీ మారిన సమయంలో ఫిరాయింపుల చట్టాన్ని వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. విలీనం అనేది సాధ్యం కాదని ఆయన గుర్తు చేశారు.పార్టీ మారిన ఎమ్మెల్సీలపై ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో లేని వాళ్లు పార్టీ పక్ష సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.