సీఎం ఆఫ్ ది ఇయర్ మమతా బెనర్జీ...!

SMTV Desk 2018-12-21 11:18:41  Mamatha banerjee, West Bengal CM, CM Of The Year Award

కలకత్తా, డిసెంబరు 21: ఈ ఏడాది అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంపికయ్యారు. రాష్ట్రంలో ఆమె చేపట్టిన అభివృద్ధి పనులు, తీసుకున్న నిర్ణయాలు వాటిని అమలు చేసిన తీరు ఆమెను ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలబెట్టాయి. ఈ సంవత్సరకాలంలో ఆమె అందించిన అత్యుత్తమ పాలనకు గాను స్కోచ్ ‘సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డు కు ఎంపికయ్యారు. ఈ మేరకు స్కోచ్ బృందం మమతకు శుభాకాంక్షలు తెలిపి, సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని ప్రశంసించింది.


పట్టణాలు, గ్రామాల అభివృద్ధి, పరిపాలనతో అత్యుత్తమంగా వ్యవహరించినందుకు గాను మమతను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు స్కోచ్ బృందం తెలిపింది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘కన్యశ్రీ , కార్మికుల కోసం ‘వంద రోజుల పని పథకాలు మంచి పేరు తీసుకొచ్చాయి. ‘కన్యశ్రీ పథకం గత సంవత్సరం ఐక్యరాజ్య సమితి ప్రశంసలు కూడా అందుకుంది. ఈ పథకాన్ని ఆడ శిశువుల సంరక్షణ, పోషణ కోసం అమలు చేస్తునందుకు గాను ‘అత్యున్నత ప్రజాసేవ అవార్డుతో ఐక్యరాజ్య సమితి గతేడాది మమత బెనర్జీని సత్కరించింది.