తొలి రోజు ముగిసిన ఆట

SMTV Desk 2017-07-26 18:32:42  india ,vs, srilanka, test, match, 2017, pujara, dhawan, Centurys

శ్రీలంక, జూలై 26 : ఇండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. భారత్ ఆటగాళ్ళు సెంచరీలతో కదం తొక్కారు. శిఖర్ ధావన్ 190 పరుగులు చేసి కేవలం 10 పరుగులతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నారు. మరో వైపు చతేశ్వర్ పుజార 144 పరుగులతో సెంచరీ పూర్తి చేశారు. తొలి రోజు ఆటలో భారత్ ఆటగాళ్ళ స్కోర్ శిఖర్ ధావన్ 168 బంతుల్లో 190, అభినవ్ ముకుంద్ 26 బంతుల్లో 12 , విరాట్ కోహ్లి 8 బంతుల్లో 3 పరుగులు చేసి వికెట్లు కోల్పోయారు. చతేశ్వర్ పుజార 247 బంతుల్లో 144 పరుగులు ( బ్యాటింగ్), అజింక్య రహనే 94 బంతుల్లో 39 పరుగులు (బ్యాటింగ్) చేశారు.