ఎయిర్ పోర్టులో డ్రోన్ల కలకలం

SMTV Desk 2018-12-20 20:41:37  London, Gatwick airport, Drones, Airport security

లండన్‌, డిసెంబర్ 20: నిన్న నగరంలోని గాట్విక్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ఫీల్డ్‌లో రెండు డ్రోన్లు కనపడి ఎయిర్ పోర్టు సిబ్బందిని కలవరపెట్టింది. దీంతో కొన్ని విమానాలను రద్దు చేశారు. రన్‌వేను మూసివేశారు. ఈరోజు కూడా మరికొన్ని డ్రోన్న్లు గాట్విక్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో కనిపించాయి దీంతో ఆందోళన చెందిన విమానాశ్రయ అధికారులు రన్‌వేను మూసివేశారు.

ప్రస్తుతం ల్యాండింగ్‌ కానీ టేకాఫ్‌ కానీ జరగడం లేదు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో సమారు లక్షన్నర మంది ప్యాసింజెర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎయిర్‌ఫీల్డ్‌లో డ్రోన్ల క‌నిపించ‌డంతో.. పోలీసులు వాటి కోసం అన్వేషిస్తున్నారు. ఎక్క‌డ నుంచి వాటిని ఆప‌రేట్ చేస్తున్నారో క‌నుగొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు