హనుమంతుడు ఒక ముస్లిం..!!!

SMTV Desk 2018-12-20 20:38:38  Uttarpradesh, MLC, Buqal nawab, UP CM, Yogi adityanath

ఉత్తరప్రదేశ్‌, డిసెంబర్ 20: హనుమంతునిపై రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్ ఆకర్షిత వాఖ్యాలు చేశారు. హనుమంతుడు దళితుడు కాదు, గిరిజనుడు కాదు ముస్లిం అని సరికొత్త దుమారం లేపారు. ఈ నిర్ధారణకు ఎలా వచ్చారని అడిగితే.. రహమాన్, సులేమాన్ వంటి ముస్లిం పేర్లతో హనుమాన్‌కు ప్రాస కుదురుతుందని పాండిత్యం వెళ్లబెట్టుకున్నారాయన.

ఇక అంతకుముదు సాక్షాత్తు యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడు దళితుడని ప్రకటించి దుమారం రేపారు. మరికొందరు దళితుడు కాదు గిరిజనుడని చెప్పుకొచ్చారు. సావిత్రీబాయి ఫూలే అనే దళిత బీజేపీ ఎంపీ హనుమంతుని కోతిని ఎలా చేస్తారని మండిపడుతూ ఏకంగా పార్టీకే రాజీనామా సమర్పించారు. దీనిపై ఆయన మంత్రివర్గ సహచరుడైన రాజ్‌భర్ హనుమంతుని ఆయన మానాన ఆయనను వదిలేద్దామని ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా బుక్కా నవాబ్ హనుమంతుడు ముస్లిం అంటూ సిద్ధాంతీకరించడంపై బీజేపీ నేతలు ఏమంటారో?