కొత్త బిల్లుని ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌

SMTV Desk 2018-12-20 20:37:50  Loksabha, Central minister, Ramvilas pasavan, Consumers protection, Passing new bill

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 20: ఈ రోజు లోక్‌సభలో కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాస్‌ కొత్తగా కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ-మెయిల్‌ ద్వారా కూడా వినియోగదారుడు తన ఫిర్యాదును నమోదు చేయవచ్చు అని ఆయన తెలిపారు. తన కేసును విచారించేందుకు వినియోగదారుడు లాయర్‌న ఆశ్రయించాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు.

ఈ బిల్లుకు స్టాండింగ్ క‌మిటీ అనుమ‌తి ద‌క్కింద‌న్నారు. ఇది వివాద‌ర‌హిత బిల్లు అని ఆయ‌న తెలిపారు. కృత్రిమ ఉత్ప‌త్తుల‌కు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేసే సెల‌బ్రిటీల‌కు శిక్ష ఉండ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వినియోగ‌దారుల ర‌క్ష‌ణ బిల్లు వ‌ల్ల ఫిర్యాదు న‌మోదు చేసే ప్ర‌క్రియ సులువుగా మారింద‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ ప్ర‌తిమా మోండ‌ల్ తెలిపారు.