అజిత్ స్పెషల్ సాంగ్ పూనకాలే

SMTV Desk 2018-12-20 19:21:19  viswasam, ajith, siva, imman, kollywood,thala

చెన్నై, డిసెంబర్ 20 : తమిళ దర్శకుడు శివ దర్శకత్వం లో తలా అజిత్ కుమార్ ,నయనతార జంటగా తెరకెక్కుతున్న చిత్రం విశ్వాసం . ఇటీవల విడుదలయిన పాటలు దుమ్మురేపుతున్నాయి. ఈ చిత్రానికి డి .ఇమ్మాన్ సంగీత దర్శకునిగా చేస్తున్నాడు . కాగా చిత్రానికి సంబంధించి ఇప్పటికే రెండు లిరికల్ వీడియో సాంగ్స్ ,తో పాటు అన్ని పాటలు జ్యూక్ బాక్స్ లో విడుదల చెయ్యగా , తాజాగా ఈ రోజు సాయంత్రం 7 గంటలకి వొక స్పెషల్ ఫోక్ పాటని కూడా విడుదల చేశారు . ఈ పాట నిడివి 2నిముషాలు కూడా లేదు గాని , విన్నోళ్లకి మాత్రం పూనకాలే.