రాజీనామా చేసిన నేపాల్ ప్రధాని

SMTV Desk 2017-05-27 17:32:16  share bahudhur dhevuba, pushpakumar, dahal prachanda ,congrase, bindyadevi bhandari, 9months in government,parlament,cpn,unl

నేపాల్, మే 25 : త్వరలో దేవుబా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం రాబోతున్న సందర్బంగా నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహాల్ ప్రచండ బుధవారం రోజున తమ పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నేపాల్ కాంగ్రెస్ అధినేత షేర్ బహుదూర్ దేవుబా పదవి విరమణ చేపట్టడం కోసం ప్రచండ రాజీనమా చేయడం జరిగింది. మావోయిస్టుల ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రచండ జాతినుద్దేశించి మీడియా ముందు ప్రసంగించారు. ఆయన లాంచనంగా రాజీనామా పత్రాలను అద్యక్షురాలైన బింద్యదేవి భండరికి అందజేస్తూ రాజీనామాను ప్రకటించారు. ఈ 9 నెలల పాటు ఆయన అధికారంలోని ప్రభుత్వ విజయాలను సంతోషంగా అందరితో పంచుకున్నారు. బహుదూర్ దేవుబా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు ప్రచండ ఆపద్దర్మ ప్రధానిగా కొనసాగుతారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో రాజీనామా చేయడం సరి కాదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పార్లమెంట్లో ఆయన రాజీనామా చేయాల్సిన సమయంలో సీపీఎన్-యూఎంఎల్ నిరసనలతో వీలు పడలేదు.