'అంతరిక్షం' టీం సరికొత్త వ్యూహం

SMTV Desk 2018-12-20 18:29:53  varun tej, sankalp reddy, ghazi, lavanya tripati, aditi rao haydari

హైదరాబాద్, డిసెంబర్ 20 : మొదటి సినిమా ఘాజితో నే బెస్ట్ డైరెక్టర్ అవార్డు పొందిన యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా అంతరిక్షం అనే సినిమా రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో తొలిసారిగా అంతరిక్షం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా లో అంతరిక్షానికి సంబంధించి ఎంత సేపు ఏం చూపిస్తారు? అనే సందేహం సామాన్య ప్రేక్షకులకు కలగడం సహజం. అసలు ఈ సినిమా లో ఏయే అంశాల పరిగణలోకి తీసుకున్నారు ? తాము ఆశించేవి ఈ రకం సినిమాలో వుంటాయా? అనే విషయాలను తెలుసుకోవాలని ఉంటుంది.

అందువల్లనే తెలివిగా ఈ సినిమా టీమ్ వరుణ్ తేజ్ తో వొక ప్రమోషనల్ వీడియో చేసి వదిలింది. ఈ సినిమాలో ఏయే అంశాలు చోటుచేసుకున్నది ఈ వీడియో ద్వారా తెలియజేప్పే ప్రయత్నం చేసారు . ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడానికి చేసిన ఈ ప్రయత్నం బాగుందనే చెప్పాలి.