తెలంగాణలో ప్రతిపక్ష హోదా దక్కించుకునేది ఎవరు...?

SMTV Desk 2018-12-20 18:14:24  TS Congress, Congress party, Sridhar babu,Batti vikramarka, Sabitha indrareddy, Opposition leader, TRS Party, BJP, TDP, TJS, CPI

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెరాస పార్టీ 88 సీట్లు సాధించి ఎవరి సహకారం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.మరోసారి సీఎంగా కెసిఆర్ గారు ఎన్నుకోబడ్డారు మరి 19 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కుంతుందా లేదా అని ఉత్కంఠ నెలకొంది. వొకవేళ ప్రతిపక్ష హోదా దక్కితే ఎవరికీ సి యల్ పి లీడర్ అయ్యే ఛాన్స్ వుంది వివరాల్లోకి వెళితే

కాంగ్రెస్ పార్టీలో మహా మహులు అయినా సీనియర్ లీడర్ లలో వొకరిద్దరు తప్ప అందరు ఓటమిని మూటగట్టుకున్నారు. వారిలో మంథని నుండి గెలుపొందిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరియు మధిర నుండి గెలుపొందిన భట్టి విక్రమార్క ఇంకొకరు మహేశ్వరం నుండి గెలుపొందిన సబితా ఇంద్ర రెడ్డి. వీరిలో ఎవరికి దక్కుంతుందో అని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.

ఇక శ్రీధర్ బాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంథని నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి అలాగే విప్ గా, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా, పలు వివిధ మంత్రిత్వ శాఖలకు పని చేసిన అనుభవం వుంది. కాగ శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ లో తెలంగాణ బిల్ పాస్ అవడం లో కీలక పాత్ర పోషించారు. అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా పని చేసిన అనుభవం ఉండడం వల్ల కాంగ్రెస్ శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఇదిలా వుండగా మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క గారు మధిర నియోజక వర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చీఫ్ విప్ గా, డిప్యూటీ స్పీకర్ గా చేసిన అనుభవం వుంది. ఈయన కూడా తెలంగాణ బిల్ పాస్ అవడంలో కీలక పాత్ర పోషించారు. ఈయనకి కూడా కాంగ్రెస్ ప్రతిపక్ష నేత అయ్యే అవకాశాలు వున్నాయి అని అంటున్నారు.

ఇక మరో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రరెడ్డి గారు రెండు సార్లు చేవెళ్ల నియోజక వర్గం నుండి ఎమ్మెల్యే గా గెలుపొందారు. మొదటి మహిళా హోమ్ మినిస్టర్ గా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయంలో పనిచేసిన అనుభవం వుంది. ఇపుడు మహేశ్వరం నియోజకవర్గం నుండి గెలిచి మూడవసారి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. మరి ఈమెకి కాంగ్రెస్ ప్రతిపక్ష నేత అయ్యే అవకాశం వుందా అనేది వేచి చూడాలి.
తెలంగాణాలో ఈ ముగ్గురులో ఎవరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికీ ఏ హోదా కల్పిస్తుందో చూడాలి.