ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం...?

SMTV Desk 2018-12-20 16:56:19  Chandrababu nayudu, Jagan mohan reddy, Pawan kalyan, KCR, TDP, YSRCP, Janasena, TRS, AP CM, Assembly elections, TS CM

ఓ వైపు సీఎం చంద్రబాబు నాయుడు మరో వైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరితో పాటు వారికి సమానంగా ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రముఖుడు, సినీ టాప్ హీరో పవన్ కళ్యాణ్ వీరిద్దరికి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు. మరి 2019 అసెంబ్లీ ఎనికల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎవరికీ పట్టం కడతారో చూడాలి. మొన్న తెలంగాణ కి సంబందించిన అసెంబ్లీ ఎనికల్లో గెలిచిన తర్వాత సీఎం కెసిఆర్, చంద్రబాబుని ఉద్దేశించి ఏపీ ఎన్నికల్లో వేలు పెడతాం అనడం ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చానీయాంశమైంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో అని ప్రజలు కూడా కొంత అయోమయంతో, కొంత కుతూహలంతో వున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి నెపంతో ఎన్నికలకు సిద్దంగా వున్నాడు. అలాగే ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్ళే ఆలోచనల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మరి అదే నిజం అయితే తెలంగాణ లో కెసిఆర్ లాగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో పచ్చ జెండా ఎగురవచ్చా అనేది ఇపుడు ముందున్న ప్రశ్న?

తెలంగాణ రాష్ట్రము విడిపోయాక 2014 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మద్దతుతో సీఎం కుర్చీని అదిష్టించిన విషయం తెలిసిందే. కానీ ఇపుడు పరిస్థితి మారింది, పవన్ కళ్యాణ్ వొంటరిగా పోటీ చేస్తాను అని చెప్పాడు మరి ఇపుడు వైస్సార్సీపీ,టీడీపీ, జనసేన మధ్య తీవ్రమైన పోటీ వుంది. కాంగ్రెస్ మీద అక్కడి ప్రజలు రాష్ట్రాన్ని విడదీశారు అనే కోపం తో 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. దానితో అక్కడ కాంగ్రెస్ వొక్క సీట్ గెలవక వున్న పట్టు కోల్పోయింది. 2019 కోసం కాంగ్రెస్ కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టు మనకి అర్ధం అవుతుంది.

బల బలాలు ఏంటి అని చుస్తే ఎప్పుడు ఏపీ లో కులాల పరంగా మతాల పరంగా ఆధిపత్యం చెలామణి అవుతూ వస్తుంది మరి ఈ రాబోయే ఎన్నికల్లో కులాలకు మతాలకి అతీతంగా అధికారం కట్టపెడతారా లేదా అనేది చూడాలి . ఇక టీడీపీ విషయానికి వస్తే బలమైన సామజిక వర్గం ఉండడం ప్రధాన బలం. అదే విధంగా కొత్తగా రాజధాని నిర్మాణం కోసం కష్టపడుతున్న చంద్రబాబు, మరియు సీనియర్ ఎన్టీఆర్ కుటుంబసభ్యుల అండ, అభివృద్ధి నినాదం తో ప్రజల్లోకి వెళ్తున్నట్టు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో తెరాసకు వ్యతిరేఖంగా ప్రచారం చేసిన చంద్రబాబుకు వ్యతిరేఖంగా రానున్న ఎపీ ఎన్నికల్లో టిడిపి వ్యతిరేఖ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.

ఇక వైసీపీ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో అంత్యంత ఆదరణ కలిగిన నాయకుడు. వైస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం జరిగిన పరిణామాలతో సొంత క్యాడర్ నిర్మించుకొని పాదయాత్రలతో ఎప్పుడు ప్రజల్లో మమేకం అవుతూ వున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకుపోతూ బలమైన నేతగా ఎదిగారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెరాస గెలవగానే ఎపీలో వైసిపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో కేసిఆర్ వైసిపీ కి మద్దతు ఇస్తారని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఇక పవన్ కళ్యాణ్ జనసేన అధినేత,ఈయన 2014 లో టీడీపీ కి సపోర్ట్ చేసి ఇపుడు బయటకి వచ్చిన నాయకుడు. పవన్ కళ్యాణ్ వెనుక వొక బలమైన సామజిక వర్గం ఉండడం అదనపు బలం. ఈయన ప్రభుత్వ వైఫల్యాల మీద ఎప్పుడు ప్రశ్నిస్తూ ప్రజలతో మమేకం అవుతూ వున్నారు. జనసేన ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోతున్నారు మరియు మంచి క్యాడర్ నిర్మించుకుంటున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్, తను వ్యతిరేఖించే పార్టీల నుండి పలువురు రాజకీయనాయకులని చేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో అసాంఘిక కార్యకాలాపాలు చేసే నాయకులను కూడా చేర్చుకోవడం జనసేనాకి బలహీనంగా మారింది అని చెప్పుకోవచ్చు. జనసైనుకుల అత్యత్సాహం వల్ల పార్టీకి కొంతమేర నష్టం వాటిల్లుతుంది.

ఈ పరిణామాల మధ్య రాబోయే ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి?

ఎవరిని ఆదరిస్తారో ఎవరు సీఎం కుర్చీలో కూర్చుంటారో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి...!!!