జార్ఖండ్ లో భారీ వర్షాలకు 9 మంది మృతి

SMTV Desk 2017-07-26 18:03:40  Jarkhand, Rains, 9 dead,

జార్ఖండ్, జూలై 26 : గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జార్ఖండ్ రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షాల కారణంగా జార్ఖండ్ లో 9 మంది మృతి చెందారని అక్కడి అధికారులు తెలిపారు. రాంచి లో ఒక చెట్టు కూలడంతో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, ధన్ భాద్, హాజరీ బాగ్ లో నలుగురు, ఇతర ప్రాంతాల్లో మరో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా కింద జార్ఖండ్ ప్రభుత్వం 2 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది.