కటకటాల్లో ' పందెం కోడి '

SMTV Desk 2018-12-20 14:38:28  vishal , chennai,pandem kodi,bharani,abhimanyudu,

చెన్నై , డిసెంబర్ 20 : విశాల్ పందెం కోడి సినిమాతో మన తెలుగు వారికి దగ్గరయిన హీరో . ఆయన ప్రజా సమస్యల మీద చురుకుగా స్పందిస్తూ అవసరమైనప్పుడు తన వంతు సాయంచేస్తుంటారు . అంతే కాకుండా తమిళ చిత్ర నిర్మాతల కౌన్సిల్ (టిఎఫ్పిసి) అధ్యక్షుడు . అయితే ఈ రోజు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకెళితే విశాల్ మరియు అతని కమిటీ సభ్యుల తీరు నచ్చడం లేదని, కొన్ని ఆరోపణలు చేసి ప్రత్యర్ధులు టిఎఫ్పిసి ఆఫీస్ కీ తాళం వేశారు . కాగా విశాల్ తన మద్దతుదారులతో కలిసి ఆ తాళాన్ని పగలు కొట్టడానికి ప్రయత్నించడం తో అక్కడ ఉద్రిక్తత నెలకొంది, దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విశాల్ ని ముందుగా అరెస్ట్ చేసి సంబంథిత ప్రభుత్వ అధికారులు ఈ సమస్యను పరిష్కరిస్తారని, లేదా కనీసం అసలు కీని తెరిచేవరకూ వేచి ఉండాలని పోలీసు అధికారులు ఆయనను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు .

కాగా తనను అరెస్ట్ చేయడం పై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.