భారత్ పరాజయంపై స్పందించిన గంగూలి

SMTV Desk 2018-12-20 14:26:33  Sourav ganguly, Team india, Australiya, Test match

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 20: భారత్ ఆసిస్ మధ్య జరిగిన రెండో టెస్టులో భారత్ పరాజయ పాలవడం వల్ల అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక టీమిండియా పనైపోయిందని అంటూ ఆసీస్‌ మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు , పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేని భారతీయులు జట్టు ఎంపికలో విరాట్‌- కోచ్‌ రవిశాస్త్రిపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై టిమిండియా మాజీ సారథి గంగూలి ట్వీట్‌ ద్వారా స్పందించారు. టీమిండియా గురించి అన్ని మీడియాలు, ఆసీస్‌ మీడియా చాలా ఎక్కువగా స్పందిస్తున్నాయి అని, ఐనా ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండగానే ఎలా విజయం ఖరారు చేస్తారు అని ప్రశ్నించారు.